CGI అంటే ఏమిటి (What is CGI ), CGI ని ఎలా సృష్టిస్తారో తెలుసా
CGI అంటే ఏమిటి (What is CGI), సినిమాల్లో కనిపించే భారీ రాజ్యాలు, ఆకాశంలో ఎగిరే డ్రాగన్లు, సూపర్ హీరోల అద్భుత శక్తులు, నిజ జీవితంలో అసాధ్యమైన యాక్షన్ సీన్స్, ఇవి ఎలా సాధ్యమయ్యాయి అని ఎప్పుడైనా ఆలోచించారా?
ఇలాంటి అద్భుతాల వెనకున్నదే CGI, CGI అంటే కంప్యూటర్ జెనెరేటెడ్ ఇమేజరీ (Computer Generated Imagery), ఈ రోజు సినిమా ప్రపంచం, గేమింగ్ (Gaming), ప్రకటనలు (Advertisement) ఆర్కిటెక్చర్ (Architecture), దాదాపు ప్రతి విజువల్ రంగం CGI పై ఆధారపడుతోంది, నిజం చెప్పాలంటే, CGI లేకుండా ఆధునిక వినోదాన్ని (Modern Entertainment) అసలు ఊహించలేం, అసలు CGI అంటే ఏంటి, CGIని ఎలా రూపొందిస్తారు, అలాగే CGI వలన కలిగే ఉపయోగాల గురుంచి తెలుసుకుందాం.
CGI అంటే ఏమిటి (What is CGI), సినిమాల్లో కనిపించే భారీ రాజ్యాలు, ఆకాశంలో ఎగిరే డ్రాగన్లు, సూపర్ హీరోల అద్భుత శక్తులు, నిజ జీవితంలో అసాధ్యమైన యాక్షన్ సీన్స్, ఇవి ఎలా సాధ్యమయ్యాయి అని ఎప్పుడైనా ఆలోచించారా?
ఇలాంటి అద్భుతాల వెనకున్నదే CGI, CGI అంటే కంప్యూటర్ జెనెరేటెడ్ ఇమేజరీ (Computer Generated Imagery), ఈ రోజు సినిమా ప్రపంచం, గేమింగ్ (Gaming), ప్రకటనలు (Advertisement) ఆర్కిటెక్చర్ (Architecture), దాదాపు ప్రతి విజువల్ రంగం CGI పై ఆధారపడుతోంది, నిజం చెప్పాలంటే, CGI లేకుండా ఆధునిక వినోదాన్ని (Modern Entertainment) అసలు ఊహించలేం, అసలు CGI అంటే ఏంటి, CGIని ఎలా రూపొందిస్తారు, అలాగే CGI వలన కలిగే ఉపయోగాల గురుంచి తెలుసుకుందాం.
CGI అంటే కంప్యూటర్ జెనెరేటెడ్ ఇమేజరీ (Computer Generated Imagery), CGI ని సినిమాలలో, వీడియో గేమ్స్ లలో, అలాగే టీవీ మరియు ఓ టీ టి వేదికలలో ప్రసారమయ్యే వెబ్సెరీస్ లలో అలాగే టీవీ ప్రోగ్రామ్స్ లో వచ్చే ప్రకటనలలో, ఇలా ఎన్నో రంగాలలో CGI (Computer Generated Imagery) ని ఉపయోగించి ఎన్నో అద్భుతాల్ని సృష్టిస్తున్నారు, అసలు CGI అంటే ఏమిటి, CGI ని ఎలా రూపొందిస్తారు.
CGI (Computer Generated Imagery), అనేది పూర్తిగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో సృష్టించే చిత్రాలు మరియు యానిమేషన్స్. CGI అనేది యానిమేషన్స్ (Animations), గ్రాఫిక్స్ (Graphics) మరియు VFX వి ఎఫ్ ఎక్స్ (Visual Effects) ఉపయోగించే టెక్నాలజీ.
CGI అంటే ఉదాహరణకి, కంప్యూటర్ ద్వారా సృష్టిచబడిన వింత మనుషులు, వింత వింత జంతువులు, మృగాలు అలాగే వింతయిన పక్షులు, పశువులు, సూర్యకుటుంబంలో తిరిగే గ్రహాలు, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో వస్తువులని వితనైనా నగరాలని CGI ద్వారా సృష్టిచడం జరుగుతుంది. మనం చూసే సినిమాలలో, వీడియో గేమ్స్ లలో అలాగే వెబ్సెరీస్ లలో CGI విరివిగా ఉపయోగిస్తారు.
CGI అంటే నిజ జీవితంలో సాధ్యం కాని ఎన్నో సంఘటనలని CGI ద్వారా సృష్టించవచ్చు. ఈ రోజుల్లో CGI లేకుండా సినిమా, అడ్వర్టైజింగ్, గేమింగ్, ఆర్కిటెక్చర్ వంటి రంగాలు పూర్తిగా సాగవు. CGI అనేది ముల్టీమీడియా రంగంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించవచ్చు.
అసలు CGI (Computer Generated Imagery), ని ఎలాసృష్టిస్తారు?
CGI (Computer Generated Imagery), ని సృష్టించాలంటే కంప్యూటర్ అలాగే అందులో వాడే ౩డి మోడలింగ్ ప్రోగ్రామ్స్ (3D Modeling Programs) ద్వారా CGI ని సృష్టిచడం జరుగుతుంది. CGI ని దశలవారీగా కొన్ని రకాల కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ని ఉపయోగించి సృష్టిచడం జరుగుతుంది.
ఉదాహరణకి ముందుగా కొన్ని రకాల జంతువుల చిత్రాలని ఉపయోగించి ఒక కొత్తరకమైన జంతువుని ౩డి మోడలింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా తయారుచేయడం జరుగుతుంది, తరువాత ౩డి ద్వారా తాయారు చేసుకున్న ౩డి ఆకారాన్ని లేదా జంతువుని కంప్యూటర్ యానిమేషన్స్ (Computer Animation) ద్వారా కదిలేలా చేయడం లేదా నిజంగా ఒక వింత జంతువు నిజ ప్రపంచంలో ఎలా నడుస్తుందో, ఎలా పరిగెడుతుందో, అలాగే యానిమేషన్ చేయడం జరుగుతుంది, తరువాత దశ తగిన విదంగా చర్మ రంగులని జోడించడం జరుగుతుంది, ఇక తరువాత దశ లైటింగ్ (Lighting), ఈ లైటింగ్ అనేది CGI రంగంలో ప్రధానపాత్ర పోషిస్తుంది, ఎందుకంటే CGI ద్వారా సృష్టిచిన ౩డి బొమ్మకి, నిజాన్ని తలపించేలా తయారు చేయాలంటే లైటింగ్ చాల ముఖ్యం. ఇక CGI సృష్టిలో చివరి దశ రెండరింగ్ (Rendering), కంప్యూటర్ ద్వారా సృష్టించిన అన్ని 3D ఎలిమెంట్స్‌ని హై-క్వాలిటీ ఇమేజ్ లేదా వీడియోగా మార్చడం. రెండరింగ్ అనేది చాల క్లిష్టమైన ప్రక్రియ అలాగే చాల ఖర్చుతో కూడుకొన్న దశ, ఈ రెండరింగ్ దశలో చాల సమయాన్ని వెచ్చించి తుది CGI వీడియో ని తయారు చేయడం జరుగుతుంది. ఇలా అనేక దశల వారీగా CGI సృష్టిచడం జరుగుతుంది. ఇలా సృష్టిచిన CGI వీడియో ని లేదా CGI చిత్రాన్ని వివిధ రంగాలలో ఉపయోగిచడం జరుగుతుంది.
CGI ఉపయోగం వాళ్ళ కలిగే లాభాలు, (Usages of CGI Technology)
CGI ఉపయోగం వలన కలిగే లాభాలు చాల ఉన్నాయ్. CGI ప్రధాన ఉదేశ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, ఇది ఒక అద్భుతమైన ఉపగయోగం. ఉదాహరణకి భారీగా నిర్మించే సినిమా సెట్లు, పెద్ద పెద్ద నగరాలు, అలాగే ఆ నగరాలలో సాగె పోరాట దృశ్యాలు, వీటిని నిజజీవితంలో సృష్టిచాలంటే ఎంతో ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. అందుకే CGI ద్వారా సినిమా సెట్లు, పెద్ద పెద్ద నగరాలని సృష్టించి, వాటి ద్వారా సినిమాని చిత్రకరించడం జరుగుతుంది, ఇది ఒక విధంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే, ఎందుకంటే నిజజీవితంలో పాంటసీ ప్రపంచాలు లేదా కొన్ని వందల సంవత్సరాలనాటి నగరాలని సృష్టించడం అసాధ్యం. అందుకే CGI టెక్నాలిజీని ఉపయోగిచి ఎన్నో అద్భుతాల్ని సృష్టిచడం జరుగుతుంది.
CGI ద్వారా కలిగే మరొక ప్రధానమైన ఉపయోగం, అపరిమిత క్రియేటివిటీ CGI సృష్టిలో ఎటువంటి హద్దులు ఉండవు, మనకు కావలసిన విధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ని ఉపయోగించి అద్భుతమైన ప్రపంచాలని, వింత మనుషులని, జంతువులని, పక్షులని సృష్టించవచ్చు. అందుకే CGI టెక్నాలజీ చాల రంగాలలో చాల ప్రాముఖ్యతను సంతరించుకొన్నది.
CGI ద్వారా సృష్టించిన కొన్ని ప్రసిద్ధ ఉదాహరణల గురించి తెలుసుకుందాం!
ఉదాహరణకి జురాస్సికా పార్క్ (Jurassic Park) సినిమాలో కనిపించే డైనోసార్లు (Dinosaur), డైనోసార్లు అనే రాక్షసబల్లులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి, అయితే CGI టెక్నాలిజీని ఉపయోగిచి వాటికీ తిరిగి ప్రాణం పోసి జురాసిక్ పార్క్ సినిమాలో (Jurassic Park) చూపించడం జరిగింది. అలాగే ఇంకొక అద్భుతమైన ఉదాహరణ అవతార్ (Avatar) సినిమాలో కనిపించి వింత మనుసులు, వింత జంతువులు, అలాగే వింతయిన వాహనాలు, వీటన్నిటిని CGI టెక్నాలిజీని ఉపయోగించి తయారుచేయడం జరిగినింది. అలాగే ఇంకో ఉదాహరణ బాహుబలి (Baahubali) సినిమాలో చూపించిన మహిష్మతి రాజ్యం, RRR సినిమాలో కనిపించే పులి, ఇలా ఎన్నో రకాలుగా CGI ని ఉపయోగించి సినిమాలని, వెబ్ సిరీస్‌లు, వీడియో గేమ్స్ రూపొందిచడం జరుగుతుంది.
భవిష్యత్తులో CGI పూర్తిగా నిజానికి దగ్గరగా, మరింత వేగంగా మరియు తక్కువ ఖర్చుతో అందుబాటులో రావడం ఖాయం, సంక్షిప్తంగా చెప్పాలంటే CGI సినిమా పరిశ్రమను, గేమింగ్ ప్రపంచాన్ని, ప్రకటన రంగాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది వచ్చే సంవత్సరాల్లో మరింత శక్తివంతం కావడం ఖాయం.