VFX అంటే ఏమిటి (What is VFX) సినీ మాయాజాలం ఎలా తయారవుతుంది
VFX అంటే ఏమిటి? (What is VFX) సినీ మాయాజాలం ఎలా తయారవుతుంది?
VFX అంటే ఏమిటి? (What is VFX) సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో, యాడ్స్‌లో, గేమ్స్‌లో కనిపించే అద్భుత దృశ్యాలు అన్నీ నిజంగా చిత్రీకరణ సమయంలో తీసినవి కావు. కొన్ని సన్నివేశాలు వాస్తవంగా తీయడం అసాధ్యం, ఎందుకంటే అవి చాల ఖరీదైనవి మరియు ప్రమాదకరమైనవి.
ఇలాంటి సందర్భాల్లో VFX (Visual Effects) అనే టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన సన్నివేశాల్ని రూపొందిస్తారు, VFX అంటే కెమెరాతో నేరుగా చిత్రీకరించలేని దృశ్యాలను కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో సృష్టించడం లేదా మార్చడం, దీనినే VFX అంటారు, ఈ VFX టెక్నాలజీని ఉపయోగించి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ ప్రోగ్రామ్స్ మరియు వీడియో గేమ్స్ పొందిస్తారు, ఉదాహరణకి పెద్ద బాంబు పేలుళ్లని సృష్టించడం, భారీ జంతువులు, వింత ప్రపంచాలు, అలాగే భూమికి ఎంతో ఎత్తులో జరిగే సైన్స్ ఫిక్సిన్ సన్నివేశాలు, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో అసాధారణమైన మరియు నిజ జీవితంలో లేని ఎన్నో సన్నివేశాలని, చిత్రాలని VFX సహాయంతో రూపొందిస్తారు.
అసలు VFX అంటే ఏమిటి? (What is VFX) సినీ మాయాజాలం ఎలా తయారవుతుంది?
మీరెప్పుడైనా ఆలోచించారా, సినిమాలలో మనం చూసే దృశ్యాలన్నీ నిజమైనవేనా? ఉదాహరణకి బాహుబలి చిత్రం, బాహుబలి చిత్రం ఎంత పెద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నదో మనందరికీ తెలిసిందే, అలాగే మనం హాలీవుడ్ సినిమాలని చూసినప్పుడు అబ్బరపోయే దృశ్యాలని, వింత ప్రపంచాలని ఎన్నో చూస్తాం, ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనన్ని సినిమాలలో VFXని వాడి అద్భుతమైన దృశ్యాలని సినిమా ప్రేక్షకులకు అందిచడం జరుగుగుతుంది.
VFX ని అద్భుతంగా ఉదాహరించాలంటె హాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలలో విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలలో అవతార్ సినిమా ఒక అద్భుతం అలాగే మర్వెల్ స్టూడియో వాళ్ళు నిర్మించిన అవెంజర్స్ సిరీస్ సినిమాలు. VFX సహాయంతో నిర్మిచిన ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎదో అద్భుతమైన మాయాప్రపంచంలో విహరించినంట్లు ఎంతో అనుభూతిని పొందుతాం, అసలు VFX అంటే ఏంటి దాన్ని ఎలా రూపొందిస్తారు?
సరళంగా చెప్పాలంటే VFX అనేది ఒక మాయా ప్రపంచం, దాన్ని కంప్యూటర్ సహాయంతో సృష్టిస్తారు. ముందుగా VFX అనేది ఎలా రూపొందిస్తారో తెలుసుకుందాం.
మనందరికీ తెలుసు VFX అంటే కంప్యూటర్ మాయాజాలం, VFX ద్వారా అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాలంటే, దశలవారీగా కంప్యూటర్, సినిమా కెమెరా మరియు కృత్రిమమైన ఒక వాతావరణం లేదా ఒక గది లాంటి నిర్మాణం సహాయంతో VFX ని రూపొందించడం జరుగుతుంది, అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక ప్రత్యేకమైన కృత్రిమమైన గదిని లేదా ప్రత్యేకమైన కల్పిత వాతావరణాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ కృత్రిమమైన ప్రపంచాన్ని పెద్ద గదిలోకానీ లేదా పెద్ద హాల్లోకాని, కొన్నిసార్లు బహిరంగ ప్రదేశాలలో నిర్మిచడం జరుగుతుంది. ఇలా నిర్మించిన కృత్రిమ వాతావరణం పూర్తిగా చిత్రీకరించడానికి అనువుగా సన్నివేశానికి అనుగుణంగా ప్రత్యేకంగా నిర్మిస్తారు. ఈ ప్రతేకమైన కల్పిత వాతావరణాన్ని ఒకే రంగు కలిగిన తెరతో పూర్తిగా మరియు కావలసిన విదంగా కప్పబడుతుంది, తరువాతి దశ లైటింగ్, లైటింగ్ అనేది చాల ప్రధానమైనది, VFX చాల అద్భుతంగా రూపొందించాలంటే లైటింగ్ అనేది చాలా అవసరం. అందుకే జాగ్రత్తగా కావలసిని విదంగా వెలుతురు ప్రసరిచేలాగా లైటింగ్‌ని నిర్మిస్తారు.
VFX లో తరువాత ప్రధానమైనది సినిమా కెమెరా, మంచి VFX మాయా ప్రపంచాన్ని సృష్టించాలంటే అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ కలిగిన సినిమా కెమెరా అనేది చాలా అవసరం. అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ కలిగిన సినిమా కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలని వివిధ రకాల మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ సహాయంతో, అలాగే ముందుగా కంప్యూటర్ సహాయంతో తయారుచేసుకున్న కృత్రిమ ప్రపంచాన్ని కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఇదే మనం సినిమాలో చూసే చివరి దృశ్యం, దీన్నే మనం VFX అని పిలుస్తాం, ఈ విధంగా VFX ని దశలవారీగా రూపొందించడం జరుగుతుంది.
VFX ని దశలవారిగా ఎలా రూపొందిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. VFX రూపొందించడంలో ప్రధానంగా నాలుగు దశలుంటాయి, అందులో మొదటి దశ గ్రీన్ స్క్రీన్ నిర్మాణం లేదా కృత్రిమ వాతావరణాన్ని నిర్మిచడం, అలాగే రెండవ దశ లైటింగ్, మూడవ దశ కెమెరా ఫ్యూటేజి లేదా మూవీ ఫ్యూటేజి, ఇక చివరి దశ మిక్సింగ్, ఈ చివరి దశలో కెమెరాలో రికార్డు చేసిన దృశ్యాలని మరియు కంప్యూటర్ సహాయంతో రూపొందించిన దృశ్యాలని కలపడమే చివరి దశ, ఈ నాలుగు దశలని ప్రధానమైన దశలని ఉపయోగించి VFX ని రూపొందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నాలుగు దశలని ఉపయోగించి VFX ని ఎలా రూపొందిస్తారో తెలుసుకుందాం.
VFX లో మొదటి దశ గ్రీన్ స్క్రీన్ నిర్మాణం (Designing Green Screen)
VFX లో మొదటి దశ గ్రీన్ స్క్రీన్ లేదా గ్రీన్ స్క్రీన్ గది నిర్మాణం, ముందు తెలుసుకున్న విధంగా కృత్రిమ వాతావరణంలో నిర్మించిన గదిని ఒక పచ్చని తెరతో పూర్తిగా కప్పబడుతుంది, దీనిని గ్రీన్ స్క్రీన్ నిర్మాణం అంటారు, ఇందులొ ఒక్కో సారి గ్రీన్ స్క్రీన్ లేదా వైట్ స్క్రీన్ లేదా బ్లూ స్క్రీన్‌తో కప్పబడుతుంది. ఈ తెర రంగులని చిత్రకరణకు అనుగుణంగా ఎంచుకోబడుతుంది.
VFX లో రెండవ దశ (లైటింగ్)
గ్రీన్ స్క్రీన్ లేదా బ్లూ స్క్రీన్ నిర్మాణం పూర్తయిన తరువాత లైటింగ్ నిర్మించడం, ఇది చాల క్లిష్టమైన దశ, ఒకే రంగు కలిగిన వెలుతురుతో గదిని పూర్తిగా నిర్మించడం, అలాగే గదికి లేదా గ్రీన్ స్క్రీన్ కి నలువైపులా సమానమైన వెలుతురు ప్రసరించేలా నిర్మిచడమనేది చాల కష్టతరమైన ప్రక్రియ, ఈ లైటింగ్ అనేది చాల ప్రధానమైన ప్రక్రియ, లైటింగ్ సరైన రీతిలో నిర్మిచకపోయిన లేదా ఒకే రంగు కలిగిన వెలుతురు గదికి లేదా గ్రీన్అ స్క్రీన్ కి న్నివైపులా సమానంగా ప్రసరించకపోయిన అనుకున్న విదంగా VFX రాకపోవచ్చు, అందుకే లైటింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోబడుతుంది.
VFX లో మూడవ దశ షూటింగ్ విత్ ఫిలిం కెమెరా (Shooting with a film camera)
VFX లో మూడవ దశ షూటింగ్ విత్ ఫిలిం కెమెరా (Shooting with a film camera), తగువిధంగా లైటింగ్ నిర్మాణం పూర్తయిన తరువాత నటినటులు సినిమా కెమెరా ముందు నటించడం జరుగుతుంది, దీన్ని మంచి ఫ్యూచర్స్ కలిగిన సినిమా కెమెరాతో రికార్డు చేయబడుతుంది. దీన్నే సినిమా ఫ్యూటేజీ లేదా కెమెరా ఫ్యూటేజి అంటారు, ఈ కెమెరా ఫ్యూటేజిని VFX స్టూడియోలలో వివిధరకాల మల్టీమీడియా సాఫ్ట్వేర్ల సహాయంతో ఫైనల్ అవుట్ ఫుట్ గా మార్చి సినిమా లో కలపడం జరుగుతుంది. దీనినే VFX మిక్సింగ్ లేదా VFX మేకింగ్ అంటారు.
VFX లో చివర దశ, కెమెరా ఫ్యూటేజిని ముందుగా తయారుచేసుకున్న కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో కలపడం (VFX Final Mixing)
కెమెరా ఫ్యూటేజిని ముందుగా తయారుచేసుకున్న కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో కలపడం, VFX లో ఇదే చివరి దశ, ఈ దశ చాల క్లిష్టమైన మరియు చాల సమయాన్ని కేటాయించవలసిన దశ. ఈ దశలో కెమెరా ఫ్యూటేజిని మరియు కంప్యూటర్ సహాయంతో ముందుగా తయారుచేసుకున్న కొత్త ప్రపంచంతో జత చేసి, తగువిదంగా రంగులని కలపి, నిజమైన ప్రపంచాన్ని తలదన్నేలా తీర్చిదిద్దడం, ఇదే VFX లో చివరి దశ. ఈ చివరి దశ పూర్తయిన తరువాత రూపొందిచబడని ఫైనల్ వీడియో ఫ్యూటేజిని VFX కట్స్ అని పిలుస్తారు, ఈ VFX కట్స్ ని జాగ్రత్తగా ఫైనల్ మూవీలో పొందుపరచడం జరుగుతుంది. ఇదే మనం సినిమాలో చూసే VFX ఫైనల్ అవుట్ ఫుట్. ఇలా పలు దశలు వారీగా VFX ని రూపొందించడం జరుగుతుంది.
VFX సినిమా ప్రపంచానికి కొత్త మాయాజాలాన్ని తెచ్చింది. నిజంగా చేయలేని సన్నివేశాలను కూడా పూర్తిగా జీవంతో కనిపించేలా చూపిస్తుంది. అది సినిమాల్లో కనిపించే మ్యాజిక్కు వెనుక ప్రధాన కారణం.