CGI మరియు VFX మధ్య ప్రధాన తేడా ఏమిటి (What is the difference between CGI and VFX)
CGI మరియు VFX మధ్య ప్రధాన తేడా ఏమిటి (What is the difference between CGI and VFX), CGI మరియు VFX రావడంతో సినిమాల తయారీ పూర్తిగా మారిపోయింది. భారీ సెట్లు, ప్రమాదకర స్టంట్లు, అద్భుతమైన ప్రపంచాలని సృష్టిచడం, ఇవన్నీ ఇప్పుడు డిజిటల్‌గా చాల సులభమయ్యాయి. సినిమాలు చూడడమే కాకుండా, టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకునేవారికి ఈ టాపిక్ చాలా ఉపయోగకరం. అలాగే VFX/CGI నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు కూడా ఈ సమాచారం చాల ఉపయోగకరం. సినిమాల్లో కనిపించే మ్యాజిక్ వెనకాల నిజమైన శాస్త్రం ఏమిటి? CGI మరియు VFX ఎలా వేరు వేరు టెక్నాలజీలు? ఇవి రెండు ఎలా పనిచేస్తాయి? అసలు తేడా ఏంటి? తెలుసుకుందాం.
CGI మరియు VFX మధ్య ప్రధాన తేడా ఏమిటి (What is the difference between CGI and VFX), CGI మరియు VFX రావడంతో సినిమాల తయారీ పూర్తిగా మారిపోయింది. భారీ సెట్లు, ప్రమాదకర స్టంట్లు, అద్భుతమైన ప్రపంచాలని సృష్టిచడం, ఇవన్నీ ఇప్పుడు డిజిటల్‌గా చాల సులభమయ్యాయి. సినిమాలు చూడడమే కాకుండా, టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకునేవారికి ఈ టాపిక్ చాలా ఉపయోగకరం. అలాగే VFX/CGI నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు కూడా ఈ సమాచారం చాల ఉపయోగకరం. సినిమాల్లో కనిపించే మ్యాజిక్ వెనకాల నిజమైన శాస్త్రం ఏమిటి? CGI మరియు VFX ఎలా వేరు వేరు టెక్నాలజీలు? ఇవి రెండు ఎలా పనిచేస్తాయి? అసలు తేడా ఏంటి? తెలుసుకుందాం.
ఆధునిక సినిమాలు మన కళ్ళకు ఎన్నో అద్భుతమైన నమ్యశక్యం కానీ దృశ్యాలని చూపిస్తున్నాయి, ఉదాహరణకి గాలిలో ఎగిరే హీరోలు, భారీ యుద్ధ సన్నివేశాలు, అన్య గ్రహాలలోకి ప్రవేశించడం, వింత లోకాలలో నివసించడం, వింత జంతువులతో పోరాటాలు, ఇలా ఎన్నో అద్భుతమైన సన్నివేశాలని తరచుగా సినిమాలలో చూస్తుంటాము. అయితే ఇవన్నీ నిజంగా కెమెరాతో షూట్ చేసినవి కావు, ఇలాంటి అద్భుత దృశ్యాలని సృష్టిచడం వెనక రెండు శక్తివంతమైన టెక్నాలజీలు ఉన్నాయ్, అవే సి జి ఐ (CGI) మరియు వి ఎఫ్ ఎక్స్ (VFX), ఈ రెండు టెక్నాలిజీల కలయికతో సృష్టించబడినవే మనం సినిమాలలో మరియు వెబ్ సిరీస్ లలో చూసే దృశ్యాలు.
మనలో చాలామందికి సి జి ఐ అంటే ఏమిటి (What is CGI) మరియు వి ఎఫ్ ఎక్స్ అంటే ఏమిటి (What is VFX), అనే విషయం తెలియదు, అలాగే ఈ రెండిటి మధ్య తేడా ఏమిటో స్పష్టంగా తెలియదు, అసలు ఈ రెండు టెక్నాలజీల మధ్య తేడాను తెలుసుకుందాం.
సినిమాలలో మనం చూసేది చాల భాగం సినిమా కళాకారులతో నిజంగా షూట్ చేసినది కాదు, కొన్ని సన్నివేశాలని పూర్తిగా కంప్యూటర్ సహాయంతో తయారు చేస్తారు, ఎందుకంటే కొన్ని రకాలైన సన్నివేశాలని నిజ జీవితంలో, నిజమైన కళాకారులతో నటింపజేయడం సాధ్యం కాదు, మరికొన్ని సన్నివేశాలని కెమెరాతో షూట్ చేయడం దాదాపు అసాధ్యం, ఇలాంటి క్లిష్టమైన సమయాలలో మూవీ మేకర్స్ CGI మరియు VFX టెక్నాలజీని ఉపయోగించి నిజజీవితంలో నిజమైన కళాకారులతో షూట్ చేయడానికి సాధ్యం కానీ సన్నివేశాలని చిత్రీకరిస్తారు.
ఉదాహరణకి సినిమా హీరో ఒక వింత జంతువుతో పోరాడాల్సిన సన్నివేశాన్ని చిత్రీకరించాలి, ఇప్పుడు ఈ సన్నివేశాన్ని నిజమైన ప్రపంచంలో చిత్రీకరించడం అసాధ్యం, ఎందుకంటే వింత జంతువులు లేదా వింతయిన ఆకారం కలిగిన జంతువులు మనం భూగోళంలో లేవు, మరి ఎలా సాధ్యం. ఇలాంటి సందర్భంలో CGI అనే టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది, CGI టెక్నాలజీ సహాయంతో ఒక వింత జంతువును లేదా వింత ఆకారం కలిగిన ఒక మృగాన్ని సులభంగా సృష్టించడం జరుగుతుంది, ఇలా కంప్యూటర్ సహాయంతో సృష్టించబడిన జంతువును కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో కదిలేలా చేయడం, లేదా నడిచేలా చేయడం జరుగుతుంది, అలాగే సినిమా సన్నివేశానికి అనుగునంగా ఈ జంతువు పోరాడుతున్నట్లు యానిమేషన్ టెక్నాలజీ ద్వారా కదలికల్ని తయారు చేయడం జరుగుతుంది, ఇందులో తరువాత దశ రెండరింగ్, కంప్యూటర్ సహాయంతో సృష్టించిన యానిమేషన్స్ తుది దశలో రెండరింగ్ టెక్నాలజీ ద్వారా వీడియో గా మార్చడం జరుగుతుంది. దీనినే రెండరింగ్ వీడియో లేదా CGI (CGI Output) అవుట్ ఫుట్ అని పిలుస్తారు.
ఇక ఈ కల్పనలో రెండవ వ్యక్తి సినిమా హీరో, సినిమా హీరో ఒక ప్రత్యేకమైన గదిలో కానీ కృత్రిమంగా రూపొందించబడిన ఒక వాతావరణంలో అమర్చిన కెమెరా ముందు, నిజంగానే ఒక మృగంతో పోరాడుతున్నట్లు నటించాల్సి ఉంటుంది, ఇలాంటి పోరాట సన్నివేశాలని మంచి ఫ్యూచర్స్ కలిగిన సినిమా కెమరాతో రికార్డు చేసి, కంప్యూటర్ సహాయంతో సృష్టించిన మృగం యానిమేషన్ సన్నివేశాన్ని అలాగే హీరో నటించిన సన్నివేశాన్ని, రెండిటిని జతచేసి తుది విడియోగా తయారుచేయడం జరుగుతుంది, ఇలా రెండు టెక్నాలజీలని ఉపయోగించి రూపొందించిన సన్నివేశాలనే మనం చూసే సినిమాలలో వాడుతారు.
అసలు CGI మరియు VFX మధ్య తేడా ఏమిటి (What is the difference between CGI and VFX)?
ముందు మనం తెలుసుకొన్న ఉదాహరణలో కంప్యూటర్ సహాయంతో సృష్టించబడిన మృగం లేదా వింత జంతువుని CGI అంటారు, ఎందుకంటే ఇలాంటి మృగాలు మనం భూగోళంలో లేవు, లేనివాటిని కంప్యూటర్ సహాయంతో సృష్టిచడం జరుగుతుంది, ఇలా వింత జంతువులని, వింత ఆకారాలని రూపొందించడమే CGI, మరి VFX అంటే ఏమిటి (What is VFX)?
VFX అంటే CGI టెక్నాలజీ సహాయంతో సృష్టించిన దృశ్యాలని, నిజజీవితంలో కళాకారులు నటించిన దృశ్యాలని కలిపి ఒకే తుది విడియోగా రూపొందించడమే VFX. VFX అంటే CGI టెక్నాలజీ ద్వారా సృష్టించిన వీడియోని మరియు నిజమైన ప్రపంచంలో సినిమా కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలని కలపడం. ఇదే ఈ రెండిటి మధ్య ప్రధానమైన తేడా. విపులంగా చెప్పాలంటే నిజంగా కళాకారులు గ్రీన్ స్క్రీన్ ముందు నటించిన వీడియో ఫ్యూటజీని అలాగే కంప్యూటర్ సహాయంతో సృష్టించిన వీడియో ఫ్యూటేజిని జాగ్రత్తగా కలిపి, తుది మెరుగులు దిద్ది, ఒక అద్భుతమైన వీడియోని రూపొందించడమే VFX . CGI అనే టెక్నాలజీ VFX టెక్నాలజీలో ఒక భాగం మాత్రమే.
మొత్తం మీద, CGI మరియు VFX రెండు వేర్వేరు టెక్నాలజీలు అయినప్పటికీ, ఇవి కలిసే ఆధునిక సినిమాల అలౌకిక ప్రపంచాన్ని నిర్మిస్తున్నాయి. ఇలా CGI మరియు VFX కలిసి మన ఊహలకు అతీతమైన ప్రపంచాలను సృష్టిస్తాయి. మీకు సినిమా టెక్నాలజీపై ఇంకా ఆసక్తి ఉంటే, తదుపరి బ్లాగ్‌లో మరిన్ని అద్భుత విషయాలు తెలుసుకుందాం.